జీవితాన్ని అనుగ్రహించినవాణ్ణి ఎరుగుట - టిను యోహానన్, భారత్
టిను యోహానన్ ఒకప్పటి భారత్ బౌలర్. కేరళ రాష్ట్రస్థాయి జట్టుకు 2014-2018 సం|| మధ్యకాలంలో బౌలింగ్ కోచ్‌గా క్రికెట్ రంగంలోకి తిరిగివచ్చాడు. ఇప్పుడు కేరళలో అకాడమీ స్ట్రక్చర్కీ, కోచింగ్ సిస్టమ్‌కీ ఇన్చార్జ్గా పనిచేస్తున్నాడు.
నేను అద్లెటిక్ కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారు ు.జ. యోహానన్. లాంగ్ జంప్‌లో ఆసియా తరపున 8 మీటర్లు దూకిన మొదటి క్రీడాకారుడు. అద్లెటిక్స్లో అతడు సాధించిన విజయాన్ని చూసి, నేను కూడా మంచి అధ్లెట్ కావాలని ఆశపడ్డాను. కఠోరమైన శిక్షణ తీసుకున్నాను. నేను స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే హై జంప్‌లో కొన్నిసార్లు మా రాష్ట్రం తరపున పాల్గొనగలిగాను. స్కూల్లో ఆఖరు సంవత్సరం చదువుతున్నప్పుడు క్రికెట్ వైపు ఆసక్తి కనపరిచాను. క్రికెట్ ఆడడం మొదలుపెట్టినప్పుడు వేగంగా బౌలింగ్ చేయగల సామర్థ్యం నాలో ఉన్నదని నేను గుర్తించాను. దాన్ని ప్రయత్నించాను, ఉన్నతస్థాయికి చేరుకోగలనని నాకు అర్థమయింది.
దేవుని కృపనుబట్టి డెన్నిస్ లిల్లీ అనే ప్రపంచంలోనే గొప్ప బౌలింగ్ కోచ్ వద్ద శిక్షణ పొందే అవకాశం నాకు దక్కింది. ఇతడు ఒకప్పటి ఆస్ట్రేలియా బౌలర్. 5 సంవత్సరాలు అతని దగ్గర శిక్షణ పొంది నేను క్రికెట్ గురించి నేర్చుకోవలసినదంతా నేర్చుకున్నాను. 2001 లో భారత్ జాతీయ జట్టులో ఆడే అవకాశం నాకు దక్కింది. నా కలే కాదు, దక్షిణ భారతదేశంలో భాగమైన కేరళ కల కూడా నిజమయ్యింది. ఇంతకు ముందెన్నడూ కేరళ నుంచి జాతీయజట్టులో స్థానం సంపాదించలేదు. ఈ ఆటలో నా రాష్ట్రం తరపున, నా దేశం తరపున ప్రాతినిధ్యం వహించడం ఎంతో పెద్ద ఘనత
2001 డిసెంబర్లో నేను నా తొలి మ్యాచ్ ఆడాను. నేను బౌలింగ్ చేసిన తొలి ఓవర్ నాలుగో బంతికో వికెట్ తీసుకున్నాను. ఆ కొత్త పిచ్ నేను చాలా చక్కగా రాణించాను. 21 సంవత్సరాల వయసులోనే నేను అనుకున్నది సాధించానని భావించాను. నన్నెవరూ నాశనం చెయ్యలేరనీ, ఈ ఆటనుంచి నన్నెవ్వరూ దూరం చెయ్యలేరనీ నేను అనుకున్నాను. ఈ క్షణం కోసమే నేను బతికాను. నాకు అత్యంత అభిమాన ఆటగాడైన సచిన్ టెండూల్కర్ ఉన్న జట్టులో కూడా ఆడే అవకాశం వచ్చింది.
రెండేళ్లపాటు జాతీయ జట్టులో నేను ఆడాను. 2003లో నాకు కొన్ని గాయాలయ్యాయి. నేను మళ్లీ వెలుగులోకి రాగలనని అనుకున్నాను. నేను అజేయుణ్ణని తలంచాను. అయితే నాకు మరలా జట్టులో అవకాశం రాకపోయేసరికి, అదంతా సులువు కాదనే వాస్తవం నాకు తెలిసొచ్చింది. 4 సంవత్సరాలపాటు నేను ఎక్కువ సమయం సాధన చేశాను. అయినా సరే, నేను జట్టులో స్థానం సంపాదించలేకపోయాను.
క్రీస్తును అనుసరించిన కుటుంబంలో నేను పుట్టి పెరిగాను. ప్రార్థన, బైబిల్ పఠన నాకు అలవాటైన పనులే. ప్రతీరోజు బైబిలు చదువుతూ, కుటుంబ ప్రార్థన చేస్తూ ఉండేవాణ్ణి. కాబట్టి నేను మంచి క్రైస్తవుణ్ణనే పేరు సంపాదించాను. అయితే క్రికెట్ రంగంలో స్థానాన్ని కోల్పోయినప్పుడు నేను దేవునికి దగ్గరగా చేరుకోవాలని అకస్మాత్తుగా గుర్తించాను. నేనొక లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు నాకు శాంతి, విశ్రాంతి దొరుకుతాయని నా మనస్సు నన్ను నమ్మించింది. అది జరగనప్పుడు, నేను దేవునివైపు చూడడం మొదలుపెట్టాను. నాకు ఆ సమయం వరకు తెలియని వ్యక్తులెందర్నో నేను నా జీవితంలోకి తీసుకురావడం మొదలుపెట్టాను. దేవునికి నా యెడల ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక ఉన్నాయని వాళ్లు నాకు చెప్పారు. ఆయన నా గురించి శ్రద్ధ తీసుకుంటాడు కాబట్టి నేను దిగులుపడకూడదని వాళ్లు నాకు చెప్పారు.
నేను దేవుని వాక్యాన్ని మరింత శ్రద్ధగా అన్వేషించి, అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. 2007 మే నెలలో నా జీవితం ఒక యు–టర్న్ తీసుకుంది. కేవలం దేవుడెవరో అనేదే కాదు, యేసుక్రీస్తు ఎవరు అనే విషయాన్ని నేను అకస్మాత్తుగా అర్థం చేసుకున్నాను. నేను ఇంతకు ముందు నుంచే దేవునికి ప్రార్థించేవాణ్ణి, నా బైబిల్ చదువుకునేవాణ్ణి. అయితే ఈ సమయానికి ముందు యేసు ఎవరో నేను నిజంగా గ్రహించలేకపోయాను. ఆయనలో ఉన్న జీవం నేను పొందాలని క్రీస్తు నా గురించి చనిపోయాడని నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఆయన దేవుడు, నాలో ఆయన నివసిస్తున్నాడు.
ఈ ప్రత్యక్షత నా జీవితాన్ని వెంటనే మార్చివేసింది. ఆ రోజు నేను నా పాస్టర్గారిని కలిసాను. నా జీవితం మలుపు తిరిగిన అనుభూతి నాకు కలిగింది. ఆ సమయంలో పరలోక దేవుడు నాతో ఉన్నాడనీ, నన్ను ప్రేమిస్తున్నాడనీ తెలుసుకున్నాను. వర్ణించడానికి అసాధ్యమైన ఈ ఆలోచన నాకొక కొత్త జీవితాన్నిచ్చింది.
దేవుడు నాతో ఆ రోజు చాలా స్పష్టంగా మాట్లాడాడు. జీవాన్నిచ్చేవాడు ఆయనేనని తెలుసుకోవడానికి నాకు అనుమతినిచ్చాడు. దేవునికే మన ఆత్మలను అప్పగించాలి. అంతకంటే విలువైనదేదీ ఈ లోకంలో లేదు. నిజమైన జీవితాన్నీ, యేసుక్రీస్తు ద్వారా శాంతినీ నాకు అనుగ్రహించేది దేవుడే కాబట్టి నేను సమస్తాన్నీ ఆయన కోసమే చేస్తున్నాను. చింతలన్నింటి నుంచీ, భయాలన్నిటినుంచీ, ఒత్తిడి నుంచీ ఈ ప్రత్యక్షతే నన్ను విడుదల చేసింది. నా క్రికెట్ జీవితంలో నేను మోసిన భారాలన్నీ హఠాత్తుగా నా నుంచి తొలగిపోయూయి.
ఆరోజు నుంచి నేను క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టిన ప్రతీసారీ అక్కడున్నది నేను మాత్రం కాదని నేను గుర్తించడం మొదలుపెట్టాను. నా ద్వారా దేవుడు కార్యం చేస్తున్నాడు. ”కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి యేలాగు లేపబడెనో, అలాగే మనమును నూతన జీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మము వలన మరణములో పాలుపొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి” అని రోమా 6:4 చెబుతున్నది. నేను పాత టినును కాదు. నేను యేసుక్రీస్తులోనూ, ఆయన నాలోనూ ఉన్నాము. నన్ను నడిపించేది ఆయనే.
బైబిల్లో నాకిష్టమైన వచనం కీర్తన 32:8. ”నీకు ఉపదేశము చేస్తాను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాను, నీమీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను.” ఈ సత్యం నా జీవితంలో వాస్తమయ్యింది. నాకు ఒక ఆధారమయ్యింది. నాకెంతో బలాన్నిచ్చింది.
ఈ లోకంలో నీవు సంపాదించిన పేరు ప్రతిష్ఠలూ, ధనమూ క్రీస్తులోని జీవితంతోపాటు ఏమాత్రం పోల్చదగినవి కావు. ఈ లోకం నీకు ఇవ్వజూపే ప్రతిదాని కంటే మీ ఆత్మ చాలా విలువ గలది. మీ ఆత్మను రక్షించుకోవడానికి ఒకే ఒక్క మార్గముంది. అది యేసుక్రీస్తు ద్వారానే. తండ్రి దగ్గరకు చేరుకోవడానికి ఆయనొక్కడే మార్గం. మన ప్రభువు, రక్షకుడు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను నిజమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాను.
టినుకు ఇష్టమైన వచనం
నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవాల్సిన మార్గాన్ని నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను (కీర్తన 32:8).