SportGoMag is for sportspersons around the world to tell their life, sport and faith in Christ-centered stories.

జీవితాన్ని మార్చే వ్యక్తిగత విశ్వాసం - వెస్‌ హల్‌, వెస్టిండీస్‌

వెస్‌ హల్‌ వెస్టిండీస్‌ లెజండరీ ఫాస్ట్‌ బౌలర్‌. ఇతడు బార్బడోస్‌లో చాలా పేద కుటుంబంలో పెరిగాడు. ఇప్పుడు ఇతని వయసు 81 సంవత్సరాలు. తన క్రీడా జీవితాన్ని .సి.సి. క్రికెట్‌ దిగ్గజం నెమరువేసుకుంటూ ఇలా చెప్పాడు,

మా ఇల్లు ప్రేమతో నిండి ఉండేది. అయితే ఆధునిక సౌకర్యాల్లో కనీసం ఒక్కటి కూడా మాకు ఉండేది కాదు. 8 సంవత్సరాల వయస్సున్నప్పుడే క్రికెట్‌ ఒక శ్రేష్ఠమైన జీవితాన్ని అనుభవించడానికి తోడ్పడుతుందని నేను ఆశపడ్డాను. వెస్టిండీస్‌ జట్టులో చోటు సంపాదించడం నా లక్ష్యం.

మా నాన్నగారు చేసే ఉద్యోగానికి చాలా తక్కువ జీతం వచ్చేది. మా అమ్మ కూడా ఒకటికి మించి ఉద్యోగాలు చేస్తూ కుటుంబ పోషణకు సహకరించేది. మా అమ్మ చాలా బలమైన విశ్వాసం, విలువలు కలిగిన స్త్రీ. నేను నిజంగా ఆమెను గమనిస్తుండేవాణ్ణి. యవ్వన వయసులో ఉన్నప్పుడు కేవలం నేను మతాచారాలను పాటిస్తుండేవాడిని. అయితే చాలా సంవత్సరాల తర్వాత క్రీస్తును నా రక్షకునిగా అంగీకరించి, దేవునితో ముఖ్యమైన ఆథ్యాత్మిక సంబంధాన్ని అనుభవించవచ్చని నేను అర్థం చేసుకున్నప్పుడు నేను రక్షించబడ్డాను.

తర్వాత నేనొక రాజకీయ నాయకుణ్ణయ్యాను. ఒక టీవీ కార్యక్రమంలో రిపోర్టర్‌తో దురుసుగా ప్రవర్తించాను. మా అమ్మగారు టెలివిజన్‌లో దాన్ని చూసినేను నిన్ను ఎలా పెంచానో అలా నువ్వు ప్రవర్తించలేదనినన్ను గద్దించింది.

నిక్కచ్చిగా, ప్రేమతో మాట్లాడే నా తల్లి మాటలు నాకెంతో సహాయపడ్డాయి. వాటినిబట్టి నేనామెను అభినందించేవాణ్ణి. ఆమె ప్రభావమూ, క్రమశిక్షణా నన్ను రోజు విధంగా రూపుదిద్దాయి. వెస్టిండీస్‌ ఆటగాడిగా మా ప్రత్యర్థులను శత్రువులుగా కాక, పోటీదారులుగానే నేను గౌరవించాలనుకునేవాణ్ణి.

నా అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌ భారత్‌తో మ్యాచ్‌ ద్వారా చక్కగా మొదలయ్యింది. క్వీన్స్‌లాండ్‌ తరపున షెఫీర్డ్‌ షీల్డ్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన రెండు మ్యాచ్‌ల ద్వారా నేను బాగా ఆస్వాదించాను. వెస్టిండీస్‌ తరపున హ్యాట్రిక్‌ వికెట్లు సాధించిన మొదటి బౌలర్‌ని నేనే. పాకిస్తాన్‌పై నేను హ్యాట్రిక్‌ సాధించాను. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో రెండే రెండు మ్యాచ్‌లు టై గా ముగిసాయి. ఆస్ట్రేలియాతో టై అయిన ఒక ప్రముఖ టెస్ట్‌ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ బాల్‌ వేసింది నేనే.

వికెట్లకు చాలా దూరం నుంచి పరిగెడుతూ వస్తూ, నిప్పులు చేరిగే బంతుల్ని సంధిస్తూ బ్రతి బాల్‌కు వికెట్‌ తీయాలనే ఉద్దేశంతోనే హాల్‌ బౌలింగ్‌ చేశాడు. లార్డ్స్‌ మైదానంలో తన చివరి టెస్ట్‌ మ్యాచ్‌లో గంటల తరబడి ఓవర్‌ తర్వాత ఓవర్లు బౌలింగ్‌ చేసిన సందర్భాన్ని ఎవ్వరూ మర్చిపోలేరుఅని విస్‌డెన్‌ క్రికెటర్స్‌ అల్మనాక్‌ రాసింది.

అయితే నా క్రీడా జీవితం ముగిసిన తర్వాతనే, నేను క్రీస్తు ప్రభు వైపు తిరిగి, నా పాపాల్ని క్షమించమని అడిగి, నా వ్యక్తిగత రక్షకుడిగా ఉండమని ప్రార్థించాను. అప్పుడే నా కొత్త జీవితం మొదలయ్యింది.

నా జీవితంలో ఎన్నో శ్రేష్ఠమైన సంవత్సరాలను ఆయనను వెంబడించకుండా వృధా చేసుకున్నాను. క్రీస్తు అనుచరునిగా ఎన్నో సంవత్సరాలు చాలామంది క్రికెటర్స్‌కూ, వెస్టిండీస్‌ జట్టుకూ సేవలందించడం అద్భుతమైన విషయం. వెస్టిండీస్‌ ప్రముఖ ఫాస్ట్‌ బౌలర్స్‌లో మార్కమ్‌ మార్షల్‌ ఒకడు. తన జీవితంలోని ఆఖరి నెలలో తన నిత్యజీవం గురించి నాతో సంభాషించాడు. అప్పుడు మాల్కమ్‌కి జీవితాన్ని మార్చే వ్యక్తిగత విశ్వాసాన్ని పరిచయం చేసిన ఆనందం నాకు దక్కింది. అదొక ప్రత్యేకమైన జ్ఞాపకం.

ప్రభువును వ్యక్తిగతంగా తెలుసుకుని, ఇతరులకు సేవ చెయ్యడం ఎంతో ఆనందకరమైన విషయం.

వెస్‌కు ఇష్టమైన వచనం:

నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నానుఫిలిప్పీ 3:8

జీవితాన్ని మార్చే వ్యక్తిగత విశ్వాసం - వెస్‌ హల్‌, వెస్టిండీస్‌

May 13, 2019

వెస్‌ హల్‌ వెస్టిండీస్‌ లెజండరీ ఫాస్ట్‌ బౌలర్‌. ఇతడు బార్బడోస్‌లో చాలా పేద కుటుంబంలో పెరిగాడు. ఇప్పుడు ఇతని వయసు 81 సంవత్సరాలు. తన క్రీడా జీవితాన్ని .సి.సి. క్రికెట్‌ దిగ్గజం నెమరువేసుకుంటూ ఇలా చెప్పాడు,

మా ఇల్లు ప్రేమతో నిండి ఉండేది. అయితే ఆధునిక సౌకర్యాల్లో కనీసం ఒక్కటి కూడా మాకు ఉండేది కాదు. 8 సంవత్సరాల వయస్సున్నప్పుడే క్రికెట్‌ ఒక శ్రేష్ఠమైన జీవితాన్ని అనుభవించడానికి తోడ్పడుతుందని నేను ఆశపడ్డాను. వెస్టిండీస్‌ జట్టులో చోటు సంపాదించడం నా లక్ష్యం.

మా నాన్నగారు చేసే ఉద్యోగానికి చాలా తక్కువ జీతం వచ్చేది. మా అమ్మ కూడా ఒకటికి మించి ఉద్యోగాలు చేస్తూ కుటుంబ పోషణకు సహకరించేది. మా అమ్మ చాలా బలమైన విశ్వాసం, విలువలు కలిగిన స్త్రీ. నేను నిజంగా ఆమెను గమనిస్తుండేవాణ్ణి. యవ్వన వయసులో ఉన్నప్పుడు కేవలం నేను మతాచారాలను పాటిస్తుండేవాడిని. అయితే చాలా సంవత్సరాల తర్వాత క్రీస్తును నా రక్షకునిగా అంగీకరించి, దేవునితో ముఖ్యమైన ఆథ్యాత్మిక సంబంధాన్ని అనుభవించవచ్చని నేను అర్థం చేసుకున్నప్పుడు నేను రక్షించబడ్డాను.

తర్వాత నేనొక రాజకీయ నాయకుణ్ణయ్యాను. ఒక టీవీ కార్యక్రమంలో రిపోర్టర్‌తో దురుసుగా ప్రవర్తించాను. మా అమ్మగారు టెలివిజన్‌లో దాన్ని చూసి 'నేను నిన్ను ఎలా పెంచానో అలా నువ్వు ప్రవర్తించలేదని' నన్ను గద్దించింది.

నిక్కచ్చిగా, ప్రేమతో మాట్లాడే నా తల్లి మాటలు నాకెంతో సహాయపడ్డాయి. వాటినిబట్టి నేనామెను అభినందించేవాణ్ణి. ఆమె ప్రభావమూ, క్రమశిక్షణా నన్ను రోజు విధంగా రూపుదిద్దాయి. వెస్టిండీస్‌ ఆటగాడిగా మా ప్రత్యర్థులను శత్రువులుగా కాక, పోటీదారులుగానే నేను గౌరవించాలనుకునేవాణ్ణి.

నా అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌ భారత్‌తో మ్యాచ్‌ ద్వారా చక్కగా మొదలయ్యింది. క్వీన్స్‌లాండ్‌ తరపున షెఫీర్డ్‌ షీల్డ్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన రెండు మ్యాచ్‌ల ద్వారా నేను బాగా ఆస్వాదించాను. వెస్టిండీస్‌ తరపున హ్యాట్రిక్‌ వికెట్లు సాధించిన మొదటి బౌలర్‌ని నేనే. పాకిస్తాన్‌పై నేను హ్యాట్రిక్‌ సాధించాను. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో రెండే రెండు మ్యాచ్‌లు టై గా ముగిసాయి. ఆస్ట్రేలియాతో టై అయిన ఒక ప్రముఖ టెస్ట్‌ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ బాల్‌ వేసింది నేనే.

''వికెట్లకు చాలా దూరం నుంచి పరిగెడుతూ వస్తూ, నిప్పులు చేరిగే బంతుల్ని సంధిస్తూ బ్రతి బాల్‌కు వికెట్‌ తీయాలనే ఉద్దేశంతోనే హాల్‌ బౌలింగ్‌ చేశాడు. లార్డ్స్‌ మైదానంలో తన చివరి టెస్ట్‌ మ్యాచ్‌లో గంటల తరబడి ఓవర్‌ తర్వాత ఓవర్లు బౌలింగ్‌ చేసిన సందర్భాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు'' అని విస్‌డెన్‌ క్రికెటర్స్‌ అల్మనాక్‌ రాసింది.

అయితే నా క్రీడా జీవితం ముగిసిన తర్వాతనే, నేను క్రీస్తు ప్రభు వైపు తిరిగి, నా పాపాల్ని క్షమించమని అడిగి, నా వ్యక్తిగత రక్షకుడిగా ఉండమని ప్రార్థించాను. అప్పుడే నా కొత్త జీవితం మొదలయ్యింది.

నా జీవితంలో ఎన్నో శ్రేష్ఠమైన సంవత్సరాలను ఆయనను వెంబడించకుండా వృధా చేసుకున్నాను. క్రీస్తు అనుచరునిగా ఎన్నో సంవత్సరాలు చాలామంది క్రికెటర్స్‌కూ, వెస్టిండీస్‌ జట్టుకూ సేవలందించడం అద్భుతమైన విషయం. వెస్టిండీస్‌ ప్రముఖ ఫాస్ట్‌ బౌలర్స్‌లో మార్కమ్‌ మార్షల్‌ ఒకడు. తన జీవితంలోని ఆఖరి నెలలో తన నిత్యజీవం గురించి నాతో సంభాషించాడు. అప్పుడు మాల్కమ్‌కి జీవితాన్ని మార్చే వ్యక్తిగత విశ్వాసాన్ని పరిచయం చేసిన ఆనందం నాకు దక్కింది. అదొక ప్రత్యేకమైన జ్ఞాపకం.

ప్రభువును వ్యక్తిగతంగా తెలుసుకుని, ఇతరులకు సేవ చెయ్యడం ఎంతో ఆనందకరమైన విషయం.

వెస్‌కు ఇష్టమైన వచనం:

నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను - ఫిలిప్పీ 3:8