SportGoMag is for sportspersons around the world to tell their life, sport and faith in Christ-centered stories.

క్రీస్తులో సంపూర్ణత - ఫాప్‌ డు ప్లెసిస్‌, దక్షిణాఫ్రికా

ఫాప్‌ డు ప్లెసిస్‌కు 34 సం||లు. దక్షిణాఫ్రికా జట్టులో అత్యంత స్థిరంగా ఆడే కుడిచేతివాటం బ్యాట్స్‌మన్‌. క్రికెట్‌లో తనను తాను నిరూపించుకుని, ప్రస్తుతం జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. నవంబర్‌ 2012 లో అతడు టెస్ట్‌ క్రికెట్‌లో అరంగ్రేటం చేసి, ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో 4 వాడయ్యాడు.

క్రీడా జీవితంలో అత్యంత విజయవంతమైన 7 సంవత్సరాలు కలిగియున్న డుప్లెసిస్‌ తను నమ్మకముంచిన దేవుణ్ణి మరచిపోలేదు.

నేను స్కూల్‌లో చదువుతున్న రోజులనుంచే చాలా ఆటల్లో పాల్గొన్నప్పటికీ క్రికెట్‌కే నేను ఎల్లప్పుడూ మొదటి స్థానం ఇచ్చేవాణ్ణి. నేను అంతర్జాతీయంగా అడడం మొదలుపెట్టినప్పుడు ఇతర క్రీడల్లో మాదిరిగానే క్రికెట్‌లో కూడా ఎత్తుపల్లాలుంటాయని నాకు వెంటనే తెలిసొచ్చింది. నా క్రీడా జీవితంలో నేనెంతో అనుభవాన్ని సంపాదించాను. క్రికెట్‌లోనే కాదు, జీవితంలో కూడా ఎత్తుపల్లాa్ల స్థిరంగా ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను. అవకాశాలు వచ్చేకొలదీ, నేను ఆటను నేర్చుకొనేకొలదీ నా విజయాల్నీ, వైఫల్యాల్నీ ఒకేలా ఆస్వాదించడం మొదలుపెట్టాను.

నేను క్రీస్తు అనుచరుణ్ణే అని భావిస్తూ ఎదిగాను. కానీ క్రైస్తవ్యం కేవలం నాకొక మతం మాత్రమే. యేసుతో నాకు వ్యక్తిగత సంబంధం ఉండేది కాదు. నా హృదయంలో విశ్వాసం అనే వేరు ఎన్నడూ లేదు. అప్పుడు నేనొక పాస్టర్‌తో నా ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు అతడు యేసు ప్రేమ నిజంగా ఎలా ఉంటుందో నాకు వివరించాడు. అతడు ఇప్పుడు నాకు స్నేహితుడు. నాకు అద్భుత సత్యం అర్థమవ్వగానే నేను బాప్తిస్మం పొందాలని నిర్ణయించుకున్నాను. నేను నా జీవితాన్ని క్రీస్తుకు ఇచ్చినప్పుడు నా హృదయంలో వెంటనే మార్పు కలిగింది. ఎంతో స్పష్టంగా దేవుని గురించిన సత్యాలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఇంతకుముందెన్నడూ అనుభవించని సంపూర్ణతను నేను క్రీస్తులో కనుగొన్నాను. సత్యాలకు అనుగుణంగా నా జీవితాన్ని మార్చుకోవాలని నేను అనుకున్నాను.

నా జీవితాన్నే, ప్రదర్శననూ దేవునికిచ్చి, క్రికెట్‌ మైదానంలో విజయాలు వరించినా, అపజయాలు వెంటాడినా ఆయనను నమ్మాలనే విషయాన్ని అర్థం చేసుకోవడం మొదట్లో కష్టంగానే ఉండేది. అయితే నేను నా విశ్వాస జీవితంలో ఎదిగాను. దేవుని సార్వభౌమాధికారం గురించి అర్థం చేసుకున్నాను. నన్నిక్కడ దేవుడు ఒక ఉద్దేశంలోనే ఉంచాడని నేను నిజంగా నమ్ముతున్నాను. ఆయనలో నా జీవితానికొక ఉద్దేశముంది.

క్రీస్తు అనుచరునిగా ఆటలో కొనసాగుతున్నప్పుడు నేను ఎదుర్కొనే కొన్ని సవాళ్లు ఉన్నాయి. నేనుండే పరిస్థితులే నాకు మొదటి సవాలు. ఎన్నో నమ్మకాలతో, ఎన్నో మతాలనుంచి వచ్చే ఆటగాళ్ళ మధ్యలో నేనొక్కణ్ణే క్రీస్తు అనుచరుణ్ణి. నాతో కలిసి సహవాసం చేయడానికీ, ప్రార్థన చేయడానికీ ఎవ్వరూ నాతో ఉండరు కాబట్టి నేనిక్కడ ఒంటరితనంతో గడపాల్సిందే. మేమెదుర్కునే శోధనలే నాకు రెండవ సవాలు. ప్రపంచమంతటా మేము ప్రయాణిస్తుంటాం కాబట్టి నేను చేయకూడని పనులు చెయ్యమని నా జట్టు సభ్యులు కొన్నిసార్లు ఒత్తిడి చేస్తుంటారు. అయితే నేను నా విశ్వాసంలో బలపడి, పరిణితి సాధించేకొలదీ వాళ్లకు అడ్డు చెప్పడం సులభమవుతుంది.

కేవలం యేసు మూలంగానే నేను ఆటలో విజయవంతంగా కొనసాగుతున్నాను. ప్రతిరోజూ అందు నిమిత్తమే ఆయను స్తుతిస్తున్నాను. నా క్రీడా జీవితం ముగిసేటప్పటికీ, నేను చాలామంచి నాయకునిగా, ఇతర ఆటగాళ్ళలో స్ఫూర్తిని నింపి వాళ్ళనుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టిన నిపుణునిగా గుర్తిండిపోవాలని నా ఆశ. నేను నమ్మిన సిద్ధాంతాల మీక కచ్చితంగా నిలబడే వ్యక్తిగా నన్ను సమాజం గుర్తించాలని నా కోరిక.

ఆఖరుగా, మా దేశంపై నేనొక చెరగని ముద్ర వేయాలని నా అభిలాష. క్రికెట్‌ మైదానంలో నేను సాధించే ఎక్కువ పరుగులకన్నా గొప్ప ఉద్దేశం దేవుడు నా పట్ల కలిగి ఉన్నాడని నాకు తెలుసు. ప్రజలతో సమయం గడిపి, వాళ్ళకు యేసు ప్రేమను చూపించి, ఆయన ప్రేమ వారి ద్వారా ప్రకాశించేలా చేయాలని నేను ఆశిస్తున్నాను.

ఫాప్‌కు ఇష్టమైన వచనం

దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి” – ఫిలిప్పీ 4:16

క్రీస్తులో సంపూర్ణత - ఫాప్‌ డు ప్లెసిస్‌, దక్షిణాఫ్రికా

May 13, 2019

ఫాప్‌ డు ప్లెసిస్‌కు 34 సం||లు. దక్షిణాఫ్రికా జట్టులో అత్యంత స్థిరంగా ఆడే కుడిచేతివాటం బ్యాట్స్‌మన్‌. క్రికెట్‌లో తనను తాను నిరూపించుకుని, ప్రస్తుతం జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. నవంబర్‌ 2012 లో అతడు టెస్ట్‌ క్రికెట్‌లో అరంగ్రేటం చేసి, ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో 4 వాడయ్యాడు.

క్రీడా జీవితంలో అత్యంత విజయవంతమైన 7 సంవత్సరాలు కలిగియున్న డుప్లెసిస్‌ తను నమ్మకముంచిన దేవుణ్ణి మరచిపోలేదు.

''నేను స్కూల్‌లో చదువుతున్న రోజులనుంచే చాలా ఆటల్లో పాల్గొన్నప్పటికీ క్రికెట్‌కే నేను ఎల్లప్పుడూ మొదటి స్థానం ఇచ్చేవాణ్ణి. నేను అంతర్జాతీయంగా అడడం మొదలుపెట్టినప్పుడు ఇతర క్రీడల్లో మాదిరిగానే క్రికెట్‌లో కూడా ఎత్తుపల్లాలుంటాయని నాకు వెంటనే తెలిసొచ్చింది. నా క్రీడా జీవితంలో నేనెంతో అనుభవాన్ని సంపాదించాను. క్రికెట్‌లోనే కాదు, జీవితంలో కూడా ఎత్తుపల్లాa్ల స్థిరంగా ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను. అవకాశాలు వచ్చేకొలదీ, నేను ఆటను నేర్చుకొనేకొలదీ నా విజయాల్నీ, వైఫల్యాల్నీ ఒకేలా ఆస్వాదించడం మొదలుపెట్టాను.

నేను క్రీస్తు అనుచరుణ్ణే అని భావిస్తూ ఎదిగాను. కానీ క్రైస్తవ్యం కేవలం నాకొక మతం మాత్రమే. యేసుతో నాకు వ్యక్తిగత సంబంధం ఉండేది కాదు. నా హృదయంలో విశ్వాసం అనే వేరు ఎన్నడూ లేదు. అప్పుడు నేనొక పాస్టర్‌తో నా ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు అతడు యేసు ప్రేమ నిజంగా ఎలా ఉంటుందో నాకు వివరించాడు. అతడు ఇప్పుడు నాకు స్నేహితుడు. నాకు అద్భుత సత్యం అర్థమవ్వగానే నేను బాప్తిస్మం పొందాలని నిర్ణయించుకున్నాను. నేను నా జీవితాన్ని క్రీస్తుకు ఇచ్చినప్పుడు నా హృదయంలో వెంటనే మార్పు కలిగింది. ఎంతో స్పష్టంగా దేవుని గురించిన సత్యాలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఇంతకుముందెన్నడూ అనుభవించని సంపూర్ణతను నేను క్రీస్తులో కనుగొన్నాను. సత్యాలకు అనుగుణంగా నా జీవితాన్ని మార్చుకోవాలని నేను అనుకున్నాను.

నా జీవితాన్నే, ప్రదర్శననూ దేవునికిచ్చి, క్రికెట్‌ మైదానంలో విజయాలు వరించినా, అపజయాలు వెంటాడినా ఆయనను నమ్మాలనే విషయాన్ని అర్థం చేసుకోవడం మొదట్లో కష్టంగానే ఉండేది. అయితే నేను నా విశ్వాస జీవితంలో ఎదిగాను. దేవుని సార్వభౌమాధికారం గురించి అర్థం చేసుకున్నాను. నన్నిక్కడ దేవుడు ఒక ఉద్దేశంలోనే ఉంచాడని నేను నిజంగా నమ్ముతున్నాను. ఆయనలో నా జీవితానికొక ఉద్దేశముంది.

క్రీస్తు అనుచరునిగా ఆటలో కొనసాగుతున్నప్పుడు నేను ఎదుర్కొనే కొన్ని సవాళ్లు ఉన్నాయి. నేనుండే పరిస్థితులే నాకు మొదటి సవాలు. ఎన్నో నమ్మకాలతో, ఎన్నో మతాలనుంచి వచ్చే ఆటగాళ్ళ మధ్యలో నేనొక్కణ్ణే క్రీస్తు అనుచరుణ్ణి. నాతో కలిసి సహవాసం చేయడానికీ, ప్రార్థన చేయడానికీ ఎవ్వరూ నాతో ఉండరు కాబట్టి నేనిక్కడ ఒంటరితనంతో గడపాల్సిందే. మేమెదుర్కునే శోధనలే నాకు రెండవ సవాలు. ప్రపంచమంతటా మేము ప్రయాణిస్తుంటాం కాబట్టి నేను చేయకూడని పనులు చెయ్యమని నా జట్టు సభ్యులు కొన్నిసార్లు ఒత్తిడి చేస్తుంటారు. అయితే నేను నా విశ్వాసంలో బలపడి, పరిణితి సాధించేకొలదీ వాళ్లకు అడ్డు చెప్పడం సులభమవుతుంది.

కేవలం యేసు మూలంగానే నేను ఆటలో విజయవంతంగా కొనసాగుతున్నాను. ప్రతిరోజూ అందు నిమిత్తమే ఆయను స్తుతిస్తున్నాను. నా క్రీడా జీవితం ముగిసేటప్పటికీ, నేను చాలామంచి నాయకునిగా, ఇతర ఆటగాళ్ళలో స్ఫూర్తిని నింపి వాళ్ళనుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టిన నిపుణునిగా గుర్తిండిపోవాలని నా ఆశ. నేను నమ్మిన సిద్ధాంతాల మీక కచ్చితంగా నిలబడే వ్యక్తిగా నన్ను సమాజం గుర్తించాలని నా కోరిక.

ఆఖరుగా, మా దేశంపై నేనొక చెరగని ముద్ర వేయాలని నా అభిలాష. క్రికెట్‌ మైదానంలో నేను సాధించే ఎక్కువ పరుగులకన్నా గొప్ప ఉద్దేశం దేవుడు నా పట్ల కలిగి ఉన్నాడని నాకు తెలుసు. ప్రజలతో సమయం గడిపి, వాళ్ళకు యేసు ప్రేమను చూపించి, ఆయన ప్రేమ వారి ద్వారా ప్రకాశించేలా చేయాలని నేను ఆశిస్తున్నాను.

ఫాప్‌కు ఇష్టమైన వచనం

''దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి'' - ఫిలిప్పీ 4:16